Namaste NRI

గాంధీ జయంతి కానుకగా ఇదే మా కథ

జీవితాన్వేషణలో నలుగురు బైక్‌ రైడర్స్‌ తెలుసుకున్న సత్యాలేమిటి? అపరిచితులైన వారి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడిరదనేది ఈ చిత్ర కథ అని అన్నారు గురుపవన్‌. ఆయన దర్వకత్వం వహిస్తున్న చిత్రం ఇదే మా కథ.  దర్శకుడు మాట్లాడుతూ రోడ్‌ జర్నీ అడ్వెంచరస్‌ చిత్రమిది. భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు బైక్‌ రైడర్స్‌ తమ గమ్యాన్ని ఎలా చేరుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథే హీరోగా నమ్మి రూపొందిస్తున్నాం. ప్రతి పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్‌, పాటలకు చక్కని స్పందన లభిస్తున్నది. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచే చిత్రమిది అని తెలిపారు. పృథ్వీ రాజ్‌, సప్తగిరి, శ్రీకాంత్‌ అయ్యాంగార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సి.రామ్‌ ప్రసాద్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌. శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమికా చావ్లా, తాన్యహోప్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న సినిమా విడుదల చేయనున్నట్టుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events