నవీద్‌ఖాన్, స్నేహ శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ది స్కూల్. ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉపశీర్షిక. వాల్మీకి దర్శకుడు. శివ రెమిడాల నిర్మాత. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టీఎఫ్‌సీసీ మెంబర్ పద్మిని నాగులపల్లి కెమెరా స్విచాన్ చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు.
సహజత్వం ఉట్టిపడేలా సినిమాను తీయగల దర్శకుడు వాల్మీకి అని, వాస్తవసంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని హీరో నవీద్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా దర్శక, నిర్మాతలు కూడా మాట్లాడారు. ఇంద్రజ, కృష్ణభగవాన్, రాజారవీంద్ర, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ ఠాకూర్. మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: వాల్మీకి.