యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రం డీజే టిల్లు. ఇప్పుడీ సినిమాకు స్వీక్వెల్‌గా టిల్లు స్వేర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. మల్లిక్ రామ్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తు న్నారు. ఇప్పటికే విడుదలైన టికెట్టే కొనకుండా రాధిక వంటి పాటలు పాపులర్ అయ్యాయి. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయబోతు న్నట్లు తాజా ప్రకటనలో నిర్మాణ సంస్థ వెల్లడించిం ది. కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ఈ సినిమా ప్రేక్షకు లందరిని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, సంగీతం: రామ్ మిరియాల.
