Skip to main content

Namaste NRI

కుందవాయిగా త్రిష.. పొన్నియిన్‌ సెల్వన్‌ నుండి ఫస్ట్‌ లుక్‌

ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పాత్రధారులు లుక్స్‌ని రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే విక్రమ్‌, ఐశ్యర్యారాయ్‌ తదితరుల లుక్స్‌ విడుదలయ్యాయి. తాజాగా త్రిష లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో రాణి కుందవై పాత్ర చేస్తున్నారు త్రిష.  ఆమె లుక్‌ని రిలీజ్‌ చేసి, పురుషుల ప్రపంచంలో దైర్యం ఉన్న స్త్రీ రాణి కుందవై అని చిత్ర బృందం పేర్కొంది. ఈ పోస్టర్‌లో త్రిష ఒంటినిండా నగలతో అత్యంత సౌందర్యంతో  రవివర్మ గీసిన పేయింటింగ్‌లా మెరిసిసోతుంది. ఈ పోస్టర్‌ త్రిష అభిమానులను ఫిదా చేస్తుంది. చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ జులై 7న తంజావూరులోని బృహదేశ్వరా  టెంపుల్‌లో విడుదల చేయనున్నారని కోలీవడ్‌ వర్గాల సమాచారం.  తమిళ్‌, తెలుగు, మలయాళం,  కన్నడ, హిందీ భాషల్లో తొలి భాగాన్ని సెప్టెంబర్‌ 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం:  ఏఆర్‌ రెహమాన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events