Skip to main content

Namaste NRI

యూఏఈ కీలక నిర్ణయం.. భారత్‌పై నాలుగు నెలలు

గోధుమల ఎగుమతులపై యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న గోధమలు, గోధమ పిండిని, ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా నాలుగు నెలల పాటు నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. అయితే మే 14న భారత్‌ గోధమ ఎగుమతులను నిషేధించడంతో యూఏఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు దేశీయ వినియోగం కోసం యూఏఈకి గోధమలను ఎగుమతి చేయడానికి భారత్‌ ఆమోదించిందని పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే గోధుమలను ఎక్కువగా పండిరచే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది.

                ఎగుమతి చేసేందుకు ఇప్పటికే అనుమతించిన దేశాలకు ఎగుమతి కొనసాగుతుందని, క్రెడిట్‌ లెటర్‌ జారీ అయిన వాటికి సంబంధించి ఎగుమతికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని పున సమీక్షించుకోవాలని ప్రపంచ దేశాలు భారత్‌ను కోరాయి. ఆహార కొరత తలెత్తకుండా ప్రపంచ దేశాలకు 469,202 టన్నుల గోధుమల ఎగుమతికి భారత్‌ అనుమతి ఇచ్చింది. తమకు గోధుమలను సరఫరా చేయాలని ఇండోనేషియా, ఒమన్‌ యూఏఈ, బంగ్లాదేశ్‌, యెమన్‌ దేశాలు భారత్‌కు విజ్ఞప్తి చేశాయి. యూఏఈ విజ్ఞప్తి మేరకు ప్రజల అవసరాలకు సరిపడ్డా గోధుములను పంపేందుకు భారత్‌ సుముఖత వ్యక్తం చేసింది.

Social Share Spread Message

Latest News