Skip to main content

Namaste NRI

నా కెరీర్‌లో మర్చిపోలేనిది : యష్‌ పూరి

యష్‌ పూరి హీరోగా  సిటాడెల్‌: హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించా రు. సమంత, వరుణ్‌ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యం లో యష్‌ పూరి మాట్లాడుతూ ఈ సిరీస్‌ నా కెరీర్‌ను మరో మెట్టెక్కించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రైటర్‌ సీతా, సపోర్ట్‌ చేసిన నటి సమంత, డైరెక్టర్‌ రాజ్‌ డీకేకు కృతజ్ఞతలు. సమంత, వరుణ్‌తో కలసి నటించే అవకాశం రావడం నా కెరీర్‌లో మర్చిపోలేనిది.  ఈ సిరీస్‌ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కినందుకు ఆనందంగా ఉంది. సిటాడెల్‌: హనీ బన్నీ నా కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా. త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాను అని తెలిపారు.

Social Share Spread Message

Latest News