Skip to main content

Namaste NRI

బర్త్‌ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం

వాణిజ్యపరమైన బర్త్‌ టూరిజంలో పాల్గొనే లేదా దానికి సహకరించే విదేశీయులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త వీసా ఆంక్షల విధానాన్ని ప్రకటించింది. విదేశాంగ మంత్రి రూబియో ఈ విధానాన్ని ప్రకటించారు. అమెరికాకు వెళ్లి అక్కడ బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డకు పౌరసత్వం పొందేలా చేసే ఏర్పాట్లపై ట్రంప్‌ ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలను ఇది మరింత కఠినతరం చేస్తుంది.

వాణిజ్యపరమైన బర్త్‌ టూరిజంలో ఉద్దేశపూర్వకంగా పాల్గొనే, దాని ద్వారా లాభాలు పొందే లేదా దానికి సహకరించే వ్యక్తులకు వీసాలు జారీ చేయడాన్ని పరిమితం చేయనున్నారు. ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చే వ్యక్తుల కుటుంబసభ్యుల్లో కొందరిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నదని ప్రకటనలో పేర్కొన్నారు. పౌరసత్వ పవిత్రతను ఉల్లంఘించడాన్ని అమెరికా అనుమతించదని రూబియో పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events