Skip to main content

Namaste NRI

అమెరికా వీసా కష్టాలు.. అపాయింట్‌మెంట్‌కు 500 రోజులు

వ్యాపార పర్యటన కోసమో లేక విహారయాత్ర కోసమో మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన వీసా కోసం కోల్‌కతాలోని అమెరికా కాన్సులేట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే అపాయింట్‌మెంట్‌ కోసం కనీసం 16 నెలలపాటు వేచిచూసేందుకు మీరు సిద్ధం కావాల్సిందే. వీసా నిరీక్షణ సమయాలు విపరీతంగా పెరిగినందున ఆ మాత్రం నిరీక్షించక తప్పదు. ఈ వెయిటింగ్‌ టైమ్‌ను తగ్గించేందుకు గత ఏడాది కాలంగా అమెరికా పలు చర్యలు చేపట్టడంతో పరిస్థితి కొంత మేరకు మెరుగుపడింది.

ముఖ్యంగా భారతీయ దరఖాస్తుదారుల కోసం ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో 14 లక్షల వీసాలను ప్రాసెస్‌ చేయడంతోపాటు విజిటర్‌ వీసా అపాయింట్‌మెంట్‌ టైమ్‌ను 75% మేరకు తగ్గించగలిగారు. అయినప్పటికీ అమెరికా వీసాల కోసం సుదీర్ఘ కాలంపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి మళ్లీ తలెత్తింది. ప్రస్తుతం బీ1/బీ2 వీసాల కోసం భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో నిరీక్షణ సమయం ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నది.

కోల్‌కతాలో అత్యధింగా 499 రోజులపాటు నిరీక్షించాల్సి వస్తుండగా, చెన్నైలో 486 రోజులు, హైదరాబాద్‌లో 435 రోజులు, ఢిల్లీలో 432 రోజులు, ముంబై 427 రోజులు పడుతున్నది. ఒకవేళ మీరు థర్డ్‌ కంట్రీ నేషనల్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుంది. అపాయింట్‌మెంట్‌ కోసం అబూధాబీలో 332 రోజులు, దుబాయ్‌లో 289 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events