Skip to main content

Namaste NRI

కెనడాకు అమెరికా వార్నింగ్

కెనడా పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు అమెరికా నుంచి పొందిన అన్ని ప్రయోజనాలకు ప్రతిఫలంగా తిరిగి తమకు మూల్యం చెల్లించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ నుంచి పొందిన వాటికి పూర్తి పరిహారం చెల్లించేవరకు కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌ ను అమెరికాలోని మిచిగాన్‌తో కలిపే గోర్డీ హోవే అంతర్జాతీయ వంతెన ను బ్లాక్‌ చేస్తామని బెదిరించారు.

2014 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలివి తక్కువగా ఆలోచించి ఈ వంతెన నిర్మాణానికి కావల్సిన మినహాయింపులు ఇచ్చారని ట్రంప్‌ విమర్శించారు. వంతెన నిర్మాణానికి అయిన ఖర్చులో సగమైనా అమెరికాకు చెల్లించాలని, లేదా వంతెనపై ఇరుదేశాలకు సమాన యాజమాన్య హక్కులు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కెనడాకు సూచించారు.

Social Share Spread Message

Latest News