Namaste NRI

‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ప్రీ రిలీజ్ వేడుక విజయవంతం

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నెని, వై. రవి శంకర్ నిర్మించారు. మార్చి 19 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా నాకు చాలా ఇష్టమైనదని, అన్నం పెట్టిందని, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిందని అన్నారు, నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను, అభిమానులు ఆనందంగా వుండేలా సినిమా బాగుండాలని కోరుకుంటాను అన్నారు. ఈ సినిమాకు మద్యలో మార్పులు చేశామని, తర్వాత కొవిడ్ వచ్చిందని, తర్వాత రాజకీయాలల్లో భాద్యతలవల్ల లేటు అయ్యింది అన్నారు. సినిమాను 45 రోజులల్లో పూర్తి చేశామన్నారు. హరీష్ శంకర్ తపనతో ఈ సినిమా చేశాడని , సత్తా ఉన్న దర్శకుడని ఈ సినిమా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ అనుకున్న దానికంటే ఆలస్యం అయిందని దానికి కారణం నేనే అని, ఇంత వేగంగా పూర్తిఅవడానికి కూడా కారణం నేనే అన్నారు. నిర్మాతలు మంచిగా సహకరించారని అన్నారు. ఈ సారి ఉగాది పవన్ కళ్యాణ్ సినిమాతో ప్రారంభంకానుంది అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events