Skip to main content

Namaste NRI

పోలీస్ కంప్లెయింట్ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ పోలీస్‌ కంప్లెయింట్‌. సంజీవ్‌ మేగోటి దర్శకుడు. సింగపూర్‌ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్‌ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ కృష్ణ మీద స్పెషల్‌ సాంగ్‌ షూట్‌ చేశామని ఈ పాట సినిమాకు మెయిన్‌ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా నేడు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఫస్ట్‌లుక్‌ని లాంచ్‌ చేశామని, మనం చేసే చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నదని, హారర్‌, థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇదొక వినూత్న ప్రయత్నమని మేకర్స్‌ తెలిపారు. నవీన్‌చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్‌, ఆదిత్య ఓం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.ఎన్‌.హరీష్‌, సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సుధాకర్‌ మారియో, సంజీవ్‌ మేగోటి.

Social Share Spread Message

Latest News