Namaste NRI

మట్కా నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం మట్కా. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలు.  కరుణ కుమార్‌ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో వరుణ్‌తేజ్‌ యంగ్‌స్టర్‌, మిడిల్‌ ఏజ్డ్‌ మ్యాన్‌గా రెండు విభిన్నమైన లుక్స్‌తో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఓ సాధారణ యువకుడు అసాధారణ శక్తిగా ఎదిగిన వైనాన్ని ఆవిష్కరించేలా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను తీర్చిదిద్దారు. పీరియాడిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. భిన్న కాలవ్యవధుల్లో నడిచే ఈ కథలో వరుణ్‌తేజ్‌ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారు. దేశం మొత్తం సంచలనం సృష్టించిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాం అని చిత్ర బృందం పేర్కొంది. నవీన్‌చంద్ర, అజయ్‌ఘోష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిషోర్‌ కుమార్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, నిర్మాతలు: విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్‌.

Social Share Spread Message

Latest News