Skip to main content

Namaste NRI

పవర్‌ఫుల్‌  పోలీస్ పాత్రలో వెంకటేష్ ?

వెంకటేష్ కథానాయకుడిగా హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో  భారీ యాక్షన్ హంగులతో రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ పవర్‌ఫుల్‌  పోలీస్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. తన తొలి రెండు చిత్రాలు హిట్, హిట్-2లో హీరోల్ని పోలీస్ పాత్రల్లో శక్తివంతంగా ప్రజెంట్ చేసిన శైలేష్ కొలను ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్‌ను  కొత్తగా డిజైన్ చేశారని చెబుతున్నారు. స్టెలిష్ మేకోవర్‌తో  ఆయన కనిపిస్తారని సమాచారం. సైంధవ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events