Namaste NRI

వెంక‌టేశ్ కొత్త సినిమా ప్రారంభం

న‌టుడు విక్ట‌రీ వెంక‌టేశ్  తన తదుపరి చిత్రం దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో  చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇండిపెండెన్స్ డే కానుక‌గా,  ఈ ప్రాజెక్ట్ పూజ కార్య‌క్రామాలు పూర్తి చేసుకుంది. వెంకటేశ్ సోద‌రుడు సురేష్ బాబు ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ 77 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ త్వ‌ర‌లోనే షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతుండ‌గా ప్రాజెక్ట్‌కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events