విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మృణాల్ ఠాకూర్ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్‌నివ్వగా, ఫైనాన్షియర్ సత్తె రంగయ్య కెమెరా స్విఛాన్ చేశారు. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్, రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల.