Skip to main content

Namaste NRI

విజయ్‌ దేవరకొండ చిత్రం ప్రారంభం

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి క్లాప్‌నివ్వగా, ఫైనాన్షియర్‌ సత్తె రంగయ్య కెమెరా స్విఛాన్‌ చేశారు. విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్ధన్‌ రావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నది. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్‌, సంగీతం: గోపీసుందర్‌, ఆర్ట్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్‌, రచన-దర్శకత్వం: పరశురామ్‌ పెట్ల.

Social Share Spread Message

Latest News