విశ్వక్‌సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ డ్రామా గామి. చాందిని చౌదరి కథానాయిక. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పతాకంపై శబరీష్ నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఘోరా గెటప్‌లో విశ్వక్‌సేన్ లుక్ ఆశ్చర్యపరి చేలా ఉంది. చుట్టూ చాలా మంది అఘోరా లు ఆయన్ను తాకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ భయకరంగా కనిపిస్తున్నది. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో శంకర్ అనే అఘోరాగా కనిపించ నున్నారు. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌రెడ్డి, సంగీతం: నరేశ్ కుమారన్, నిర్మాత: కార్తీక్ శబరీష్, దర్శకత్వం: విద్యాధర్ కాగిత.