Skip to main content

Namaste NRI

9 గంటల్లో ఏం జరిగింది?

తారకరత్న, అజయ్‌, వినోద్‌ కుమార్‌, మధు షాలిని, రవి వర్మ, ప్రీతీ అస్రానీ నటించిన వెబ్‌ సిరీస్‌ 9 అవర్స్‌. దర్శకుడు క్రిష్‌ సో రన్నర్‌గా, నిరంజన్‌ కౌశిక్‌, జాకోబ్‌ వర్గీస్‌ దర్శకులుగా వ్యవహరించారు. ఫస్ట్‌ ప్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై  రాజీవ్‌ రెడ్డి. వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ జూన్‌ 2 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ ఒక  రోజులో 9 గంటల్లో ఏం జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. బ్యాంక్‌ దొంగతనంతో పాటు అనేక ఆసక్తికరమైన అంశాల కలబోతగా కథ నడుస్తుంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది అన్నారు.  మహేశ్‌బాబు త్రివిక్రమ్‌ గార్ల చిత్రంలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ ఛాన్స్‌ వస్తే లక్‌గా భావిస్తా అన్నారు. మధుషాలిని  మాట్లాడుతూ వెబ్‌సిరీస్‌లో నేను చిత్ర అనే జర్నలిస్ట్‌  పాత్రలో నటిస్తున్నా. 80వ దశాబ్దంలో కథ నడుస్తుంది. ధైర్యవంతురాలైన జర్నలిస్ట్‌గా నా పాత్ర స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. ప్రతి పాత్ర సహజత్వానికి దగ్గరగా ఆకట్టుకుంటుంది అని అన్నారు.

Social Share Spread Message

Latest News