అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడే చిక్కుకున్న విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఆ ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. వాళ్లు ఎప్పుడు తిరిగి భూమి మీదకు వస్తారన్న విషయంపై క్లారిటీ లేదు. కేవలం 8 రోజుల మిషన్‌కు వెళ్లి, ఇంత వరకు తిరిగి రాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వాళ్లు వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే స్పేస్ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములను తీసుకువచ్చేందుకు నాసా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.