Namaste NRI

కార్మిక శాఖ సొలిసిటర్ గా భారత సంతతి మహిళ

అమెరికాలో జో బైడెన్‌ ప్రభుత్వంలో మరో భారతీయ సంతతి మహిళకి చోటు లభించింది. కార్మిక శాఖ సొలిసిటర్‌గా భారత సంతతికి చెందిన పౌరహక్కుల న్యాయవాది సీమా నంది నియామకానికి అమెరికన్‌ సెనేట్‌ ఆమోద ముద్ర వేసింది. 48 ఏళ్ల వయసున్న సీమా నందా డెమొక్రాటిక్‌ నేషనల్‌ కమిటీకి సీఈఓగా కూడా పనిచేశారు. ఒబామా హయాంలో కార్మిక శాఖకి సేవలు అందించారు. కాగా నందా నియామకాన్ని సెనేట్‌ 53`46 ఓట్లతో ఆమోదించింది. సీమా నందా నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా ముప్పు, వాతావరణంలో మార్పులతో యాజమాన్యాలు, కార్మికులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్న తరుణంలో కార్మిక శాఖ సొలిసిటర్‌గా ఆమె నియామకం అత్యంత కీలకంగా మారింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress