Skip to main content

Namaste NRI

వరల్డ్‌ బాక్సింగ్‌ పోటీ.. తెలంగాణ యువతి సంచలనం!

  తెలంగాణ  యువ బాక్సర్‌ నిఖిత్‌ జరీస్‌ మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఈ ఏడాది స్ట్రాండ్జా మెమోరియల్‌ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించిన నిఖిత్‌, ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో బ్రెజిల్‌కు చెందిన కారోలైన్‌ డి అల్మెడపై 5`0 తేడాతో విజయం సాధించింది. కచ్చితంగా రజతం ఖాయమైనప్పటికీ బంగారు పతకం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఛాంపియన్‌ షిప్‌లో భారత్‌ తరపున మేరికోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ సి మాత్రమే టైటిల్‌ను నెగ్గారు. ఇప్పుడు నిఖిత్‌ గెలిస్తే వారి సరసన చేరుతుంది. 2022లో ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణీగా జరీన్‌ నిలిచింది.

Social Share Spread Message

Latest News