
మాస్టర్ ఆఫ్ సర్రియలిజం రెనె మగ్రిట్టే వేసిన పెయింటింగ్ ప్రపంచ రికార్డు సాధించింది. న్యూయార్క్‌లోని ఆక్షన్ హౌస్ క్రిస్టీలో జరిగిన వేలంలో ఇది 121,160,000 డాలర్లు (సుమారు రూ.1,022 కోట్లు) పలికింది. ఇది 1954నాటి ఆయిల్-ఆన్-కాన్వాస్ పెయింటింగ్ అని క్రిస్టీ తెలిపింది. కాంతి సామ్రాజ్యం పేరుతో చిత్రీకరించిన ఈ పెయింటింగ్‌లో, ప్రకాశవంతమైన వసంతకాల పగటి వెలుగులను, కారుమబ్బులు, శ్మశాన భయంకర చీకటిని పక్కపక్కనే చూపించారు. దీనికి 95 మిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేశామని, అంతకు మించిన ధర పలికిందని క్రిస్టీ తెలిపింది.
