Namaste NRI

ఏజెంట్ నుంచి మళ్లీ మళ్లీ నువ్వే

హీరో అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మోడల్ సాక్షి వైద్య హీరోయిన్‌గా పరిచమవుతుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథనందిస్తున్నారు.  ఏజెంట్‌లో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా నుంచి మళ్లీ మళ్లీ నువ్వే సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే.. దట్స్ ఏ సైన్ అని మనసంటుందే అంటూ సాగుతున్న ఈ పాటను ఆదిత్యా అయ్యంగార్ రాయగా,  హిప్ హాప్ తమిజా కంపోజ్ చేస్తూ పాడాడు. హిప్ హాప్ తమిజా వెస్టర్న్ స్టైల్‌లో  సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ టీజ‌ర్‌లో  అఖిల్ స్టన్నింగ్ యాక్షన్ అవతార్‌లో  కనిపిస్తూ అంచనాలు పెంచేస్తున్నాడు.  ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా  విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events