ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో జగన్ తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. అంతకు ముందు జగన్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ఇలాంటి ఫలితాలను తాను ఊహించలేదన్నారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదు, పింఛన్లు అందుకున్న అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.