తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ సందర్భంగా షర్మిల అభినందనలు తెలిపారు. అనంతరం తన కొడుకు ఎంగేజ్‌మెంట్, విహావానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించారు. కాగా, షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ తన ప్రియురాలితో ఈ నెల 18వ తేదీన జరగనుండగా, వివాహం ఫిబ్రవరి 17వ తేదీన జరగనుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల, రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం విశేషం.