Skip to main content

Namaste NRI

సీఎం రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ సందర్భంగా షర్మిల అభినందనలు తెలిపారు. అనంతరం తన కొడుకు ఎంగేజ్‌మెంట్, విహావానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించారు. కాగా, షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ తన ప్రియురాలితో ఈ నెల 18వ తేదీన జరగనుండగా,  వివాహం ఫిబ్రవరి 17వ తేదీన జరగనుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల,  రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం విశేషం.

Social Share Spread Message

Latest News