
భారత సంతతికి చెందిన యువకుడు తుషార్ కుమార్ బ్రిటన్‌లో అరుదైన ఘనత సాధించారు. 23 ఏండ్ల వయసులో ఓ పట్టణానికి పట్ణణ కౌన్సిలర్‌గా ఉన్న తుషార్ కుమార్ ఇటీవలే ఎల్‌స్ట్రీ అండ్ బోర్హమ్‌వుడ్ పట్టణ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. లండన్ కింగ్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అభ్యసించిన తుషార్‌కు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉంది. దీంతో లేబర్ పార్టీలో చేరి, 2023లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం పట్టణ మండలిలో డిప్యూటీ మేయర్‌గా పని చేశారు. అతడి సేవలు, నిబద్ధతను గుర్తించిన మండలి సభ్యులు ఇటీవల జరిగిన సమావేశంలో మేయర్‌గా ఎన్నుకున్నారు.





























