తరుణ్ భాస్కర్ దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం కీడా కోలా. తరుణ్ భాస్కర్, బ్రహ్మనందం, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్‌లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా కీడా కోలా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చింది. డిపిరి డిపిరి అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను కీడా కోలా యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు భరద్వాజ్ లిరిక్స్ అందించగా, హనుమాన్ పాడాడు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. వీజీ సైన్మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మదాడి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, ఉపేంద్ర వర్మ ఎడిటర్, ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.














