Skip to main content

Namaste NRI

సౌదీలో హైదరాబాద్‌ వాసి మృతి

సౌదీ అరేబియా-హౌతీ తిరుగుబాటుదారుల మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటున్నది. యెమెన్‌కు చెందిన ఇరాన్‌ మద్దతున్న హౌతీలు రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ ఎయిర్‌పోర్టుపై వరుస దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో హైదరాబాద్‌లోని మెహదీపట్నంకు చెందిన మహమ్మద్‌ యూసుఫ్‌ అలీ సహా 13 మంది మృతిచెందగా, 309 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 11 మంది భారతీయులున్నారు. యూసుఫ్‌ ఇద్దరు కుమారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య, కూతురు క్షేమంగానే ఉన్నారు. ఆయన మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకొస్తామని సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events