Skip to main content

Namaste NRI

నవరాత్రి తొలిరోజు స్పెషల్ సర్​ప్రైజ్- రామాయణ రిలీజ్ డేట్ అనౌన్స్

నవరాత్రుల తొలిరోజున రామాయణ మేకర్స్‌ ప్రత్యేక ప్రకటన చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ఇతిహాసానికి చెందిన తొలి భాగాన్ని ఈ ఏడాది నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమా విడుదల కానున్నది.

ఈ సందర్భంగా రణబీర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, యశ్‌ రావణుడిగా కనిపిస్తున్న కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. కథలోని పాత్రల వ్యత్యాసాన్ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ని రూపొందించారు. భారీ సెట్లు, అద్భుతమైన ఆహార్యం, ఇలా ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు ఈ పోస్టర్‌ చెబుతున్నది.

ఇది రాముడి యుగానికి ఆరంభం అనే సందేశంతో ఓ కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నట్టు మేకర్స్‌ వెల్లడించారు. నితేష్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా పౌరాణిక ఫ్రాంచైజీని నమిత్‌ మల్హోత్రా ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, యశ్‌కి చెందిన మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌, డిఎన్ఇజి భాగస్వామ్యంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events