Skip to main content

Namaste NRI

అమెరికాను అత‌లాకుతలం చేసిన హ‌రికేన్!

అమెరికా దక్షిణ ప్రాంతాన్ని ఇసైయాస్ హరికేన్ అతలాకుతలం చేసింది. తుఫాను కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. ఫ్లోరిడా, అలబామా, జార్జియా, మిస్సిసిపి రాష్ట్రాల్లో దాదాపు 6.7 లక్షల మంది నివాసితులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను బలహీనపడినప్పటికీ ఈదురుగాలులు, ఆకస్మిక వరదలు, టోర్నడో ముప్పు పొంచి ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్రంలో రాచెల్ తుఫాను కారణంగా కాలిఫోర్నియాలోనూ 7,000 మందికి కరెంట్ కోతలు విధించారు. ఫ్లోరిడాలోని డెస్టిన్ సమీపంలో గంటకు సుమారు 105 మైళ్ల వేగంతో వీచే గాలులతో కేటగిరీ 2 హరికేన్‌గా తీరాన్ని తాకిన ఇసైయాస్‌ అనే ఉష్ణమండలానంతర తుఫాను, బర్మింగ్‌హామ్ సమీపంలో మధ్య అలబామా గుండా ఈశాన్య దిశగా కదులుతోంది.

ఈ తుఫాను కారణంగా ఇప్ప‌టివ‌ర‌కు కనీసం నలుగురు మరణించారు. అలబామా, ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్‌లో చెట్లు, విద్యుత్ తీగలు నేలకూలడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో రోడ్లను మూసివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అలబామా, ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్, పశ్చిమ జార్జియాలోని చాలా ప్రాంతాల్లో లక్షలాది ఇళ్లు, వ్యాపార సంస్థలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events