Skip to main content

Namaste NRI

ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ …మొదలైంది

సత్యదేవ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఫరియా అబ్దుల్లా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు. రాజేష్‌ సెల్వ దర్శకుడు. శరత్‌ మరార్‌ నిర్మాత. ఈ సిరీస్‌ పూజా కార్యక్రమానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ అతిథిగా విచ్చేసి, మేకర్స్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇందులో సత్యదేవ్‌ ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ పోషిస్తున్నారని, రమ్యకృష్ణ తనదైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో కథకు మరింత ఇంటెన్సిటీని తీసుకురానున్నారని, ఫరియా అబ్దుల్లా పాత్ర కొత్తగా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. విరాజ్‌ అశ్విన్‌, చైతన్యకృష్ణ, వర్ష బొల్లమ్మ, యష్‌ పూరి, సంపత్‌రాజ్‌, సుబ్బరాజు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌ని నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events