Skip to main content

Namaste NRI

బ్లడీరోమియో నుంచి స్పెషల్ సర్​ప్రైజ్

నాని హీరోగా తన తదుపరి చిత్రం బ్లడీ రోమిమో కోసం సిద్ధమవుతున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. డార్క్‌ హ్యూమర్‌, యాక్షన్‌ కలబోసిన కథాంశమిది. ఈ సినిమాలో నాని సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఆయన లుక్‌ని పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన రెట్రో ైస్టెల్‌లో సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ైస్టెలిష్ట్‌ అలీమ్‌ హకీమ్‌ నాని మేకోవర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ హెయిర్‌ైస్టెల్‌ సినిమాలో ఆయన పాత్రను ప్రతిబింబిస్తూ రెబల్‌ లుక్‌ని తీసుకొచ్చింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events