సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం జమానా. భాస్కర్ జక్కుల డైరెక్టర్. ఈ మూవీ టైటిల్ ప్రోమోను డైరెక్టర్ వెంకీ కుడుముల లాంఛ్ చేశాడు. డైరెక్టర్ భాస్కర్ జక్కుల మాట్లాడుతూ చార్మినార్, ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా జమానా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. తొలి సినిమా అయినా నటీనటులు, సాంకేతిక నిపుణులు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ కథని నమ్మి సినిమాను తెరకెక్కించిన మా నిర్మాతలకి ధన్యవాదాలు. త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకొస్తాం అంటూ జమానా టైటిల్ ప్రోమో రిలీజ్ చేసిన డైరెక్టర్ వెంకీ కుడుములకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వల్లభ క్రియేషన్స్, విఎస్ అసోసియేట్స్ బ్యానర్లపై తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.














