ఈ ఏడాది కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సిరాక్యూస్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఆయన నోబెల్ కమిటీని, నార్వే ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలు ఆపానని, పరిష్కరించిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ బహుమతి చొప్పున తనకు మొత్తం ఎనిమిదిసార్లు తనకు నోబెల్ పురస్కారం రావాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్షిణాఫ్రికాకు చెందిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ కమిషనర్ నవీ పిళ్లైకి దక్కిన నేపథ్యంలో ట్రంప్‌లో అసహనం పెరిగిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా తాను నోబెల్ శాంతి బహుమతి పొందాల్సింది కానీ ఇవ్వలేదని, ఇది నార్వేకు శాశ్వత మచ్చ అని విమర్శించారు. నోబెల్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో నిర్ణయం తీసుకున్న వ్యక్తులు అవమానకరమైన పని చేశారని ట్రంప్ మండిపడ్డారు. నోబెల్ కమిటీని రాడికల్ ఐడియాలజిస్టులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు గా ఆయన అభివర్ణించారు.















