Skip to main content

Namaste NRI

కామ్రేడ్ కళ్యాణ్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ : శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరో తాజా చిత్రం కామ్రేడ్‌ కల్యాణ్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌ లో శ్రీవిష్ణు మాట్లాడుతూ ఇదొక మాస్‌ కామెడీ సినిమా. ఇప్పటివరకు నేను రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్లు మాత్రమే చేశాను. ఈ కథను ఎలా రిసీవ్‌ చేసుకుంటారోననే భయం ఉండేది. కానీ ప్రేక్షకులు చిత్రానికి అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు అన్నారు.

ఈ సినిమా విషయంలో టీమ్‌ అంచనాలన్నీ నిజమయ్యాయని, అందరూ తనను కామ్రేడ్‌ అని పిలుస్తున్నారని శ్రీవిష్ణు ఆనందం వ్యక్తం చేశారు. మార్నింగ్‌షో నుంచి ఈ కామ్రేడ్‌ కల్యాణ్‌ జనజీవన స్రవంతిలో కలిసి పోయారని, హీరో విష్ణు నక్సల్‌ గెటప్‌ చూసి సీరియస్‌ సినిమా అనుకున్నారని, కానీ ఆద్యంతం వినోదంతో ఆకట్టుకుంటున్నదని కోన వెంకట్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events