Skip to main content

Namaste NRI

శర్వానంద్ భోగి నుంచి హార్ట్ టచింగ్ సాంగ్ రిలీజ్

1960 దశకం ఆదిలాబాద్‌-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా భోగి. శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. కేకే రాధామోహన్‌ నిర్మాత. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలోని ఏగిలివారంగ లేసి అనే పాటను విడుదల చేసి మ్యూజికల్‌ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. చంద్రబోస్‌ రచించిన ఈ గీతానికి భీమ్స్‌ సిసిరోలియో స్వరాల్ని అందించారు. నల్గొండ గద్దర్‌ ఈ పాటను ఆలపించారు.

ఎగిలివారంగ లేసి.. ఇల్లలికి పూదిచ్చి.. దిగూట్ల దేవతలకు దీపాలే ముట్టిచ్చి.. కొట్టంలో బర్లూగొడ్లకు కుడితినే తాపిచ్చి.. పజ్టొన్న గడకలోకి సల్లా నీళ్లేబోసి అంటూ అచ్చ తెలంగాణ పల్లె మాండలికంలో అక్కడి గ్రామీణ జీవితం, కులవృత్తులు, సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. చంద్రబోస్‌ అద్భుత సాహిత్యం, భీమ్స్‌ సిసిరోలియో చక్కటి బాణీ, నల్గొండ గద్దర్‌ గళం కలబోతగా ఈ పాట తెలంగాణ మట్టిపరిమళాల్ని వెదజల్లింది. 1960ల నాటి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ విజువల్స్‌ కూడా ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events