జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటించిన సై ఫై థ్రిల్లర్ కిల్లర్. ధ్యానం నాన్నఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ ఎ. నిర్మించారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులు. పూర్వాజ్ దర్శకుడు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. పూర్వాజ్ మాట్లాడుతూ మా సినిమాకు కోటి రూపాయల కాంటెస్ట్‌ను ప్రకటించి, సక్సెస్‌మీట్‌లో విజేతను తెలియజేస్తామని చెప్పాం. అయితే కొందరు సోషల్‌మీడియాలో మీ సినిమాకు కోటి రూపాయల కలెక్షన్స్ వస్తాయా? అని ప్రశ్నిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు బహుమతిగా అందిస్తాం. ఈ విషయాన్ని ఊరికే చెప్పలేదు. హైకోర్టు లాయర్‌తో కొన్ని నిబంధనలతో ఒప్పందం రాయించి మరీ ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నాం అన్నారు .

సినిమా ప్రీమియర్షోస్ ప్రదర్శిస్తున్నామని, వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తీశారని కథానాయిక జ్యోతి పూర్వాజ్ చెప్పింది. సినిమా సక్సెస్‌మీట్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న విజేతను ప్రకటిస్తామని, తెలుగు సినిమాలో ఇప్పటివరకూ రాని కథాంశమిదని పూర్వాజ్ తెలిపారు. సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ, రచన-ఎడిటింగ్-దర్శకత్వం: పూర్వాజ్.















