జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ఇప్పుడు ఈ సినిమా కు సీక్వెల్ గా రూపొందిన అవతార్`2 ది వే ఆఫ్ వాటర్ రూపొందించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 16న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అత్యాధునిక సాంకేతికాంశాలతో అండర్‌వాటర్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్లో కూడా విడుదల కానుంది. కాగా అవతార్`2 తెలుగు వెర్షన్‌కు దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాశారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ భాషలో మంచి పట్టున్న శ్రీనివాస్ అవసరాల తెలుగు వెర్షన్ కోసం అద్బుతమైన సంభాషలందించారని చెబుతున్నారు. అవతార్ 2 తెలుగు వెర్సన్‌కు డైలాగులు రాశారు. రచయిత, దర్శకుడైన ఆయన డైలాగ్స్ రైటింగ్ విలక్షణంగా ఉంటాయనే విషయం విదితమే.














