
ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో సుధీర్‌రాజు, డి.వైష్ణవి నేహా నిర్మిస్తున్న చిత్రం లలిత. గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు అనేది ఉపశీర్షిక. అభిలాష్ పీలా, అఖిల్ వివాస్, నందిని ప్రధానపాత్రధారులు.వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా ఈ చిత్రం రూపొందిందని, సామాజిక నేపథ్యంతో సందేశాత్మకంగా ఈ సినిమా సాగుతుందని మేకర్స్ వెల్లడించారు. రఘుబాబు, పృథ్వీరాజ్, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్రరెడ్డి, సంగీతం: మణి, నాగరాజు, నిర్మాణం: కాస్మిక్ పవర్ క్రియేట్స్ ఎల్‌ఎల్‌పీ.





























