తమ దేశంలో చదువుకున్న భారతీయ పూర్వ విద్యార్థులకు ఫ్రాన్స్ శుభవార్త చెప్పింది. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన షెన్జెన్ వీసాలను జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం కొత్త ప్రణాళికను తీసుకొస్తున్నామని ప్రకటించింది. ఇలా 2023 నాటికి 30 వేల మంది భారత విద్యార్థులను ఆహ్వానించడమే తమ లక్ష్యమని తెలిపింది. విద్యానైపుణ్యాలను, సాంస్కృతిక బంధాలను పెంపొందించుకోవడంతో పాటు ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఫ్రాన్స్ వెల్లడిరచింది.














