Namaste NRI

18 ఏళ్ల యువకుడిగా మారేందుకు..ఏటా 16 కోట్లు

అమెరికాకు చెందిన 45 ఏళ్ల మిలియనర్ ఏకంగా 18 ఏళ్ల వ్యక్తి మాదిరిగా మారేందుకు తెగ తాపత్రయం పడుతున్నాడు. ఆ వయసు శరీరం, దృఢత్వంతోపాటు అవయవాల తీరు కోసం ఏడాదికి సుమారు 16.3 కోట్లు (రెండు మిలియన్ డాలర్లు) ఖర్చు చేయాలని నిర్ణయించాడు. వయసును రివర్స్ చేసే ఖరీదైన వైద్య విధానాలను ఆయన పాటిస్తున్నట్లు బ్లూమ్బెర్గ్ పేర్కొంది.18 ఏళ్ల యువకుడిగా మారేందుకు జాన్సన్ ప్రతి రోజూ ఖరీదైన వైద్య విధానాలు పాటిస్తున్నాడు. దీని కోసం ఏడాదికి ఎన్నో కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తి మాదిరి గుండె సామర్థ్యం పొందాడు.

జాన్సన్ శరీరంలోని అన్ని అవయవాల వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టి 18 ఏళ్ల వ్యక్తి శరీరంతోపాటు అవయవాలుగా తీర్చిదిద్దడానికి తాను కట్టుబడి ఉన్నట్లు డాక్టర్ ఆలివర్ జోల్మాన్ పేర్కొన్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, నరాలు, దంతాలు, చర్మం, జుట్టు, మూత్రాశయం, పురుషాంగం సహా అన్ని శరీర భాగాలు, అవయవాలను 18 ఏళ్ల యువకుడి మాదిరిగా జాన్సన్ కోరుకుంటున్నట్లు చెప్పారు. దీని కోసం ఈ ఏడాది రెండు మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ఆయన  భావిస్తున్నారని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events