అమెరికాలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చే దిశగా కీలక ముందడుగు పడిరది. దాదాపు రూ.75 లక్షల కోట్ల ( 1 ట్రిలియన్ డాలర్లు) విలువైన జాతీయ మౌలిక వసతుల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు సెనేట్ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దేశాధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో దాని అమలుపై కొన్నాళ్లుగా అనిశ్చితి నెలకొంది. నిధుల వ్యయానికి సంబంధించి కొన్ని నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో 67`31 ఓట్ల తేడాతో దానికి తాత్కాలిక ఆమోద ముద్ర లభించింది.
సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల బలం50`50గా ఉంది. తాజా ప్రణాళికకు తుది ఆమోదం లభఙంచేందుకు కనీసం 60 మంది సభ్యుల మద్దతు అవసరం. తుది ఆమోదం విషయంలో రిపబ్లికన్లు ఎంతమేరకు సహకరిస్తారన్న దానిపై ప్రస్తుతానికి షృష్టత లేదు. 1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రణాళిక అమలైతే అమెరికాలో దశాబ్ద కాలం పాటు ఏటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలున్నాయి.