Namaste NRI

ఆదర్శకుటుంబంలోకి నివేదా పేతురాజ్‌ ?

వెంకటేష్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆదర్శకుటుంబం. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ అతిథి పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, కీలకమైన అతిథి పాత్రలో నివేదా పేతురాజ్‌ కనిపించనుందని సమాచారం. త్వరలో ఆదర్శకుటుంబం సెట్స్‌లోకి ఈ తమిళందం అడుగుపెట్టబోతున్నదట. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను జోడించి తనదైన కామెడీ హంగులతో దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events