Namaste NRI

పెద్ది మూవీ నుంచి హెల్లెల్లో ప్రోమో విడుదల

రామ్‌చరణ్‌ నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది జూన్‌ 4న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా హ్యూజ్‌ బజ్‌ని క్రియేట్‌ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని మూడో పాటను మేకర్స్‌ నేడు విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. హెల్లో హెల్లో హెల్లో హెల్లెల్లో.. బావా.. చీరా చొక్కా చిక్కడిపోవాలో అంటూ సాగే ఈ పాటను దర్శకుడు బుచ్చిబాబు సానా అత్యంత ఎనర్జిటిక్‌గా, కలర్‌ఫుల్‌గా చిత్రీకరించినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తున్నది.

పవర్‌ఫుల్‌ డ్రమ్‌ బీట్స్‌, క్యాచీ రిథమ్‌తో జాతర వాతావరణాన్ని తలపించేలా ఈ ప్రోమో సాగింది. రామ్‌చరణ్‌, శ్రుతిహాసన్‌, జాన్వీ కపూర్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. ైస్టెలిష్‌ స్టెప్పులతో, అద్భుతమైన స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ముగ్గురూ ఆకట్టుకున్నారు. భోపాల్‌లో జరిగే భారీ మ్యూజికల్‌ ఈవెంట్‌లో పూర్తి పాటను విడుదల చేస్తారు. శివరాజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో జగపతిబాబు, దివేందుశర్మ, బోమన్‌ ఇరానీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేల్‌, సహ నిర్మాత: ఇషాన్‌ సక్సేనా, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాత: వెంకటసతీశ్‌ కిలారు, నిర్మాణం: వృద్ధి సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events