Namaste NRI

NRI టిడిపి (చార్లెట్) ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి

నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లెట్ నగరంలో Carolina NRI TDP విభాగం అధ్వర్యంలో తెలుగు వారి గుండెల్లో నాటికీ నేటికీ ఎప్పటికి చెరగని ప్రతిరూపం మన ఆరాధ్య రాముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్బంగా నివాళి అర్పించారు.NRI TDP నాయకులు శ్రీ గుదే పురుషోత్తం చౌదరి, ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

షార్లెట్ లోని అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు 150 మందికి పైగా కుటుంబాలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ శ్రీ బోడె ప్రసాద్ గారు మరియు అనంతపురం మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రభాకర చౌదరి గార్లు వర్చువల్ గా ముఖ్య అతిధిలుగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశ్యించి ప్రసంగించారు.

Social Share Spread Message

Latest News