Skip to main content

Namaste NRI

దుల్కర్, పూజా హెగ్డే శ్రీ శ్రీ ఫస్ట్‌లుక్ వచ్చేసింది

మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ మరో స్ట్రయిట్‌ ప్రేమకథతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నెలకుదితి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. పూజా హెగ్డే కథానాయిక. శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.

ఈ సినిమాకు శ్రీశ్రీ అనే ఆహ్లాదకరమైన టైటిల్‌ని ఖరారు చేశారు. లవ్‌ విల్‌ స్పార్క్‌ అగైన్‌ అనేది ఉపశీర్షిక. కాంపౌండ్‌ వాల్‌పై కూర్చుని సరదాగా కబుర్లాడుకుంటున్న దుల్కర్‌ సల్మాన్‌, పూజాహెగ్డేలను ఈ పోస్టర్‌లో చూడొచ్చు. బ్లూ షర్ట్‌, గ్రే ట్రౌజర్‌, కళ్లద్దాలతో చిరునవ్వులు చిందిస్తూ దుల్కర్‌ కనిపిస్తే, లైట్‌ బ్లూ సల్వార్‌ సూట్‌లో అతని వైపు చూసి మనసారా నవ్వుతూ పూజా హెగ్డే కనిపిస్తున్నది. ఇద్దరూ క్లాస్‌మెట్స్‌ అని పోస్టర్‌ చెబుతున్నది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ ప్రేమకథకి కెమెరా: అనయ్‌ ఓం గోస్వామి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌, సహనిర్మాత: ఇషాన్‌ సక్సేనా.

Social Share Spread Message

Latest News