Skip to main content

Namaste NRI

అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో తొలి సిక్కు అమెరిక‌న్‌గా.. చిరాగ్ వీర్ సింగ్

పంజాబీ మూలాలు ఉన్న చిరాగ్ వీర్ సింగ్ సారో అమెరికా వైమానిక ద‌ళ అకాడ‌మీలో చేరాడు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ లో చేరిన తొలి సిక్కు అమెరిక‌న్‌గా, కేశ‌ధారి సిక్కుగా చిరాగ్ నిలిచారు. కొల‌రాడో స్ప్రింగ్స్‌లో ఉన్న అకాడ‌మీలో అత‌ను శిక్ష‌ణ పొంద‌నున్నట్లు అమెరికా సిక్కు కౌన్సిల్ తెలిపింది. కేశ‌ధారి సిక్కులు .. త‌మ త‌ల వెంట్రుక‌ల‌ను, గ‌డ్డాన్ని క్ష‌వ‌రం చేయించ‌కుండా ఉంటారు. మ‌త విశ్వాసాల‌కు అనుగుణం ఆ సిక్కులు జీవిస్తుంటారు. అయితే ఏప్రిల్ 4వ తేదీన అమెరికా వైమానిక ద‌ళ అకాడ‌మీలో చిరాగ్ వీర్ నియామ‌కం జ‌రిగింది. అయితే కేశ‌ధారి హోదాలో వైమానిక ద‌ళంలో విధులు నిర్వ‌ర్తించేందుకు జూన్ 20వ తేదీన అత‌నికి అనుమ‌తి ల‌భించింది.

జూన్ 24వ తేదీన చిరాగ్‌ యూఎస్ఏఎఫ్ అకాడ‌మీలో అధికారికంగా చేరాడు. ఆరు వారాల పాటు తొలుత బూట్ క్యాంపులో పాల్గొనున్నాడు. ఎయిర్ ఫోర్స్ రిజ‌ర్వ్ ఆఫీస‌ర్ ట్రైనింగ్ కార్ప్స్‌, నావ‌ల్ ఆర్ఓటీసీ నుంచి చిరాగ్ వీర్‌కు స్కాల‌ర్‌షిప్ అందుతోంది. అకాడ‌మిక్ చ‌దువుల్లోనూ చిరాగ్ రికార్డు అద్భుతంగా ఉన్న‌ట్లు సిక్కు కౌన్సిల్ పేర్కొన్న‌ది. ఈగ‌ల్ స్కౌట్‌గా చేశాడు. తైక్వాండోలో సెకండ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్ ఉన్న‌ది. యూనివ‌ర్సిటీ వాట‌ర్ పోలో టీమ్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

Social Share Spread Message

Latest News