Skip to main content

Namaste NRI

ప్రథమ్ సంకల్ప్.. రామాయణ మహా ప్రయాణానికి శ్రీకారం

యశ్‌, నమిత్‌ మల్హోత్రాతో కలిసి స్వయంగా నిర్మించిన పానిండియా పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ. రణబీర్‌కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, రామాయణ : పార్ట్‌ 1 దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ నెల 24న ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని దిల్లీలో ప్రథమ్‌ సంక్పల్ప్‌ పేరిట ఏర్పాటు చేసిన వేడుకలో నటుడు, నిర్మాత యశ్‌ మాట్లాడారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. మనదేశం కల. ఆ కలను నిజం చేసేందుకు మేమంతా చేసిన ప్రయత్నమే రామాయణ అన్నారు.

మన సీతారాముల కథను ప్రపంచ వేదికపై నిలబెట్టాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నమిది. దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఓ మహా ప్రయాణానికి శ్రీకారం ఈ రామాయణ అని దర్శకుడు నితేశ్‌ తివారి పేర్కొన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల రణ్‌బీర్‌కపూర్‌, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, సన్నీ దేఒల్‌, శోభన, అరుణ్‌గోవిల్‌ సంతోషం వెలిబుచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24న విడుదల కానున్న ట్రైలర్‌ని ఎంపిక చేసిన అతిథులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.

Social Share Spread Message

Latest News