రష్యా, ఇరాన్, చైనా, భారత్ లను ఒకేసారి దెబ్బతీసే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దాంతో రష్యా, ఇరాన్ లపై ఆంక్షలను విధించేందుకు, వాటితో వాణిజ్యం కొనసాగిస్తోన్న భారత్, చైనాల పై సుంకాల మోత మోగించేందుకు అధ్యక్షుడికి అధికారం దఖలు పడింది.

ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ చట్టం-2026 పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు సభ 262-159 ఓట్లతో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును గత నెలలోనే సెనెట్ ఆమోదించింది. ఇప్పుడు ట్రంప్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. దాంతో భారత్ , చైనా తో సహా 10 దేశాలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ సర్కార్ భారీగా సుంకాలు విధించనుంది.














